ఈఎస్‌ఐ మెడికల్ స్కామ్‌లో విచారణ వేగవంతం

-ఈఎస్‌ఐ మెడికల్ స్కాంలో విచారణ వేగవంతం -2015 నుంచి 2019 వరకూ మందుల కొనుగోళ్ల పరిశీలన -మరికొందరు డాక్టర్లు, ఫార్మాసిస్టులను ప్రశ్నించబోతున్న ఏసీబీ అధికారులు - కార్మిక శాఖ మాజీ కమిషనర్‌ పాత్రపైనా ఏసీబీ ఆరా -గత కార్మికశాఖ మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తిపైనా దృష్టిపెట్టిన ఏసీబీ -రిమాండ్‌లో ఉన్న ఏడుగురిని కస్టడీకి ఇవ్వాలంటున్న ఏసీబీ -కాసేపట్లో కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు -ఈఎస్‌ఐ స్కాంలో పెరగనున్న నిందితుల సంఖ్య

Update: 2019-09-30 05:31 GMT

ఈఎస్‌ఐ మెడికల్ స్కాంలో విచారణ వేగవంతమైంది. 2015 నుంచి 2019 వరకూ మందుల కొనుగోళ్లను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు దేవికారాణిని అడ్డుపెట్టుకుని అందినకాడకి దోచుకున్న ఫార్మాసిస్ట్‌లను విచారిస్తున్నారు. భాస్కర ఏజెన్సీ, క్రిష్టల్ ఎంటర్‌ప్రైజెస్, శ్రీ సంతోష్, గరుడు, లక్ష్మీ ఫార్మాలపై విచారణ జరుపుతున్నారు. ఇవాళ మరికొందరిని అదుపులోకి తీసుకోనున్నారు. ఇప్పటికే రిమాండ్‌లో ఉన్న ఏడుగురు నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో ఏసీబీ కోర్టులో వాదనలు జరగనున్నాయి.

మరోవైపు కార్మిక శాఖ మాజీ కమిషనర్‌ పాత్రపైనా ఏసీబీ ఆరా తీస్తోంది. గత కార్మికశాఖ మంత్రి వద్ద ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తిపైనా ఏసీబీ దృష్టిపెట్టింది. సంచలనం రేపిన ఆడియో టేపులను పరిశీలించి, పలువురు డాక్టర్లు, ఫార్మాసిస్టులను ప్రశ్నించబోతున్నారు. దీంతో ఈఎస్‌ఐ స్కాంలో నిందితుల సం‌ఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.  

Tags:    

Similar News