Narayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

Narayana College: హైదరాబాద్ రామంతాపూర్‌ నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది.

Update: 2022-08-19 09:50 GMT

Narayana College: నిప్పంటించుకొని ప్రిన్సిపాల్‌ను పట్టుకున్న విద్యార్థి

Narayana College: హైదరాబాద్ రామంతాపూర్‌ నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. ఏకంగా ప్రిన్సిపాల్ గదిలోనే ఓ విద్యార్థి ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అక్కడితో ఆగకుండా ఒంటిపై మంటలు ఉండగానే ఆ విద్యార్థి ప్రిన్సిపల్‌ను కూడా పట్టుకున్నాడు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కాలేజీ ఫీజు కట్టే విషయంలో ప్రిన్సిపాల్ కు, విద్యార్థికి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విద్యార్థి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా మంటలు ఎగిసిపడటంతో ఏం చేయలేకపోయారు. మరోవైపు ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News