నల్గొండ జిల్లా పోక్సో కోర్టు మరో సంచలన తీర్పు.. నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75,000 జరిమానా

నల్గొండ జిల్లా పోక్సో కోర్టు మరో సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికను మభ్యపెట్టి, బలవంతంగా పెళ్లి చేసుకున్న నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష, 75 వేల రూపాయల జరిమానా విధించింది.

Update: 2025-10-23 10:16 GMT

నల్గొండ జిల్లా పోక్సో కోర్టు మరో సంచలన తీర్పు.. నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష, రూ.75,000 జరిమానా 

నల్గొండ జిల్లా పోక్సో కోర్టు మరో సంచలన తీర్పు వెల్లడించింది. మైనర్ బాలికను మభ్యపెట్టి, బలవంతంగా పెళ్లి చేసుకున్న నిందితుడికి 32 ఏళ్ల జైలు శిక్ష, 75 వేల రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి 10 లక్షల రూపాయలు పరిహారం కూడా చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది.

పానగల్లుకు చెందిన నిందితుడు గురిజాల చందుపై 2022లోనే నల్గొండ టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. న్యాయమూర్తి రోజారమణి పూర్తి సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ఎవిడెన్స్‌లను పరిశీలించిన అనంతరం ఈ కీలక తీర్పును వెల్లడించారు.

Tags:    

Similar News