నల్గొండ కోర్ట్ మరోసారి సంచలన తీర్పు.. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు
Nalgonda: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్ట్ మరోసారి సంచలన తీర్పు వెల్లడించింది.
Nalgonda: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నల్గొండ జిల్లా పోక్సో కోర్ట్ మరోసారి సంచలన తీర్పు వెల్లడించింది. నాల్గో తరగతి చదువుతున్న బాలికపై 60 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషికి 24 ఏళ్ల శిక్ష, 40 వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ. 10 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. 2023 మార్చిలో బాలికపై నల్గొండకు చెందిన ఊషయ్య అఘాయిత్యానికి పాల్పడగా.. నేడు పోక్సో కోర్ట్ తీర్పు వెల్లడించింది.