అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న ముర్ము.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Droupadi Murmu: సా. 6 గంటలకు హకీంపేట నుంచి ఢిల్లీకి వెళ్లనున్న రాష్ట్రపతి

Update: 2023-07-04 03:26 GMT

అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొననున్న ముర్ము.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

Droupadi Murmu: నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో ముర్ము పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు హకీంపేటకు చేరుకుంటారు. అక్కడి నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయానికి వెల్లనున్నారు.

మధ్యాహ్నం 3 గంటల 40 నిమిషాలకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియం చేరుకొని అల్లూరి 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు హకీంపేట నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లన్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి రోడ్డు వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. 

Tags:    

Similar News