Hyderabad: అబల కాదు సబల.. ఇంట్లోకి చొరబడ్డ దొంగలను ఎదిరించిన తల్లీకుమార్తె

Hyderabad: చోరీ కోసం ఇంట్లో చొరబడ్డ ఇద్దరు నిందితులు

Update: 2024-03-22 07:32 GMT

Hyderabad: అబల కాదు సబల.. ఇంట్లోకి చొరబడ్డ దొంగలను ఎదిరించిన తల్లీకుమార్తె

Hyderabad: హైదరాబాద్ రసూల్‌పురా కాలనీలో దొంగలను ఎదిరించిన తల్లీ కుమార్తెను నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని సన్మానించారు. నిన్న మధ్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు రాబరీకి ప్రయత్నించడంతో పాటు వెప్‌తో వారిని బెదిరించారు. ఇంట్లో ఉన్న తల్లీ కూతుర్లు వారిలో ఓ నిందితుడిని పట్టుకున్నారు. 2022లో అదే ఇంట్లో పని చేయడానికి వచ్చిన ఓ వ్యక్తి తన స్వస్థలం ఉత్తర ప్రదేశ్ కు తిరిగివెళ్లాడు. అతడితో పాటు మరో వ్యక్తిని యూపీ నుంచి తీసుకువచ్చి నిన్న రాబరీకి ప్రయత్నించారు. మరో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News