Sheep Distribution Scam: తెలంగాణ గొర్రెల స్కాంలో కీలక పరిణామం
Sheep Distribution Scam: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కాం కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Sheep Distribution Scam: తెలంగాణలో సంచలనం సృష్టించిన గొర్రెల స్కాం కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ కేసు నమోదు తర్వాత దుబాయ్ పారిపోయిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్... తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి రావడంతో..అరెస్ట్ చేశారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారుల సాయంతో మొయినుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
గొర్రెలు కొనుగోలు చేసి వాటి యజమానులకు డబ్బులు ఇవ్వకుండా మొయినుద్దీన్ ఎగ్గొట్టి... దాదాపు 700 కోట్లు నిధులు పక్క దారి పట్టించారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మొత్తం 17 మందిని అరెస్ట్ చేసిన ఏసీబీ తాజాగా ప్రధాన నిందితుడిగా ఉన్న మొయినుద్దీన్‌ను అదపులోకి తీసుకున్నారు.