Telangana: మరో నెల రోజుల పాటు ప్రారంభోత్సవాలకు నో ఛాన్స్

Telangana: ప్రమాణ స్వీకారం తరువాత కూడా అధికారిక కార్యక్రమాలకు దూరం

Update: 2021-03-03 12:38 GMT

Representational Image

Telangana: పవర్‌లోకి వచ్చి చాలా కాలమే అయినా వారంతా పవర్‌లెస్‌గా ఉన్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి వారందరికీ ఛాన్స్ లేకుండా పోయింది. ప్రారంభోత్సవాలు చేసేందుకు అవకాశమే చిక్కడం లేదు. మరో నెల రోజుల పాటు వారంతా సైలెంట్‌గా ఉండాల్సిందే. ప్రమాణ స్వీకారం చేసి చాలా రోజులు గడుస్తున్నా వారంతా సెలెంట్‌గా ఎందుకున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనడం లేదు. వారికున్న అడ్డకుంలేంటి? లెట్స్ వాచ్ దిస్.

గ్రేటర్‌ హైదరాబాద్‌ కొత్త కార్పోరేటర్లు కు కష్టాలు తప్పడం లేదు. గత ఏడాది డిసెంబర్‌లో ఎన్నికల్లో గెలిచిన దగ్గర నుంచి వారంతా సైలెంట్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లోనూ పాల్గొనడం లేదు. ప్రమాణ స్వీకారం తరువాత కూడా అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మరో నెల రోజుల పాటు ప్రారంభోత్సవాలకు దూరంగా ఉండాల్సిందే.

బల్దియా పాత పాలక మండలికి ఫిబ్రవరి 10వ తేదీ వరకు గడువున్నప్పటికీ, గత నవంబర్ ఆరంభంలోనే ఎన్నికలు జరిగాయి. నిబంధనల మేరకు పాత పాలక మండలి గడువు పూర్తయ్యేంత వరకు కొత్తవారు బాధ్యతలు స్వీకరించేందుకు వీళు లేపోవడంతో ఫిబ్రవరి 10 వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఫిబ్రవరి 11వ తేదీన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక పూర్తయింది. ఇక అధికారిక కార్యక్రమాల్లోకి హుందాగా పాల్గోవచ్చిని అందరూ భావించారు. కానీ అదే రోజు గ్రాడ్యు యేట్స్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో వారి అధికారిక కార్యక్రమాలకు, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు మరోసారి బ్రేక్ పడింది. ఈ ఎన్నికల కోడ్ ఏప్రిల్ 2వ తేదీ వరకు ఉంటుంది. దీనితో అప్పటిదాకా అధికారికంగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడానికి వీల్లేకుండా పోయింది.

హైదరాబాద్‌లో కార్పొరేటర్ టిక్కెట్ దక్కని అధికార పార్టీ నేతలు కనీసం కోఆప్షన్ సభ్యులుగా నైనా కార్పొరేటర్ల హోదా పొందాలనుకున్నారు. దానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వారు భారీ సంఖ్యలోనే ఉన్నారు. నిబంధనల మేరకు కో ఆష్షన్ సభ్యుల ఎన్నిక సైతం జరిగే అవకాశం లేకుండా పోయింది. దీంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. 

Tags:    

Similar News