Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం.. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో విక్రయం..!!
Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ ప్లాట్ల బహిరంగ వేలం.. ఫిబ్రవరి 7, 8 తేదీల్లో విక్రయం..!!
Rajiv Swagruha: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఓపెన్ ప్లాట్ల విక్రయానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 137 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా అమ్మకానికి పెట్టనున్నట్లు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ ఒక అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
ఈ ప్లాట్లు రంగారెడ్డి జిల్లాలోని తొర్రూర్ ప్రాంతంలో 105, కుర్మల్‌గూడలో 20, అలాగే మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలోని బహదూర్‌పల్లిలో 12 ప్లాట్లుగా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
ప్లాట్ల ధరలను ప్రస్తుత ఓపెన్ మార్కెట్ రేట్లతో పోలిస్తే తక్కువగానే నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. చదరపు గజానికి సుమారు రూ. 20,000 నుంచి రూ. 30,000 మధ్య కనీస ధరలను నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు మీ-సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
ఈ ప్లాట్లు ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేయబడినవే కావడంతో కొనుగోలుదారుల నుంచి మంచి స్పందన ఉంటుందని అధికారులు ఆశిస్తున్నారు. వేలం విధానం, ప్లాట్ల స్థానం, ఇతర అర్హతలు మరియు నిబంధనలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని వారు సూచించారు.