Madhavaram Krishna Rao: కవితపై ఎమ్మెల్యే కృష్ణారావు హాట్ కామెంట్స్.. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నీ చిట్టా బయట పెడతా..
Madhavaram Krishna Rao: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.
Madhavaram Krishna Rao: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు, కేటీఆర్‌ను రేవంత్ రెడ్డి సహాయంతో జైలుకు పంపించి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి రాష్ట్రాని దోచుకోవాలని కవిత ప్రయత్నిస్తుందని ఆరోపించారు. దిల్లీలో కేజ్రీవాల్‌ను నాశనం చేశావ్, ఇక్కడ కేసీఆర్, కేటీఆర్‌లను నాశనం చేయాలని చూస్తున్నావని మండిపడ్డారు. నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే, నీ చిట్టా మొత్తం బయట పెడతానన్నారు. హైదరాబాద్ నగరంలో నువ్వు చేసిన కబ్జాలపై పోరాటం చేస్తానని అన్నారు.