Hyderabad: హైదరాబాద్‌లోని ఈ ఏరియాల్లో ఇకపై ట్రాఫిక్ కష్టాలుండవ్

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ- హైటెక్‌సిటీ రాకపోకల కోసం 66.59 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్‌యూబీ

Update: 2021-04-05 05:45 GMT
ఆర్యు‌బీ (ఫైల్ ఇమేజ్)

Hyderabad: హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ- హైటెక్‌సిటీ రాకపోకల కోసం 66.59 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆర్‌యూబీని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కూకట్‌పల్లి, మూసాపేట్‌, కేపీహెచ్‌బీ, జేఎన్‌టీయూ నుంచి వచ్చే వాహనదారులు, అలాగే బాచుపల్లి, నిజాంపేట్‌, హైదర్‌నగర్‌, వసంతనగర్‌, శ్రీలా పార్క్‌ ప్రైడ్‌ పరిసర ప్రాంత వాసులు, గోకుల్‌ ఫ్లాట్స్‌ హైటెన్షన్‌ రహదారి గుండా వచ్చేవారికి ఈ ఆర్‌యూబీతో కొంత మేర ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పే అవకాశాలు ఉంటాయి.

అప్పుడు ఆర్వోబీ, ఇప్పుడు ఆర్‌యూబీ..

ఒకప్పుడు కేపీహెచ్‌బీ - హైటెక్‌సిటీ మధ్య రైల్వే శాఖ వర్షపు నీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్‌యూబీల ద్వారానే వాహనదారులు రాకపోకలు సాగించేవారు. రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్‌ దృష్ట్యా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వాహనదారుల కోసం ఆర్వోబీ (రైల్వే ఓవర్‌ బ్రిడ్జి)కి 2005లో శంకుస్థాపన చేసింది. రైల్వే అధికారుల అడ్డంకులతో ప్రాజెక్టు ముందుకు సా గలేదు. 2009లో అప్పటి కూకట్‌పల్లి ఎమ్మెల్యే జయప్రకాష్‌ నారాయణ దక్షిణ మధ్య రైల్వే అదికారులతో నిత్యం సమీక్షించి ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేలా కృషి చేశారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించి వాహనదారులకు అందుబాటులోకి తెచ్చారు.

నాలుగు వరసల ఆర్వోబీ అందుబాటులోకి వచ్చినా ఉదయం 8-11, సాయం త్రం 5-8 గంటల మధ్య వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆర్వోబీ నిర్మించడమా, ఆర్‌యూబీ మేలా అని ప్రభుత్వం చర్చించి తొలుత రూ.100 కోట్ల వ్యయంతో 1.2 కి.మీ. మేర జేఎన్‌టీయూ రోడ్డులో ఫ్లైవోవర్‌ నిర్మించింది. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్‌ కష్టాలను తగ్గించేందుకు హైటెక్‌ సిటీ రైల్వే స్టేషన్‌ సమీపంలో ఆరు వరుసల ఆర్‌యూబీకి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చేలా కృషి చేశారు. 2020 జనవరిలో ఆర్‌ఓబీ పనులు ప్రారంభించిన అధికారులు 13 నెలల్లోనే ప్రాజెక్టును పూర్తి చేశారు. 

Full View


Tags:    

Similar News