వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలి : మంత్రి కేటీఆర్

రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Update: 2020-05-09 13:09 GMT
Minister KTR(File photo)

రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్‌లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులైన చికున్ గున్యా, డెంగ్యూ, ఇతర జబ్బులను అరికట్టడానికి పగడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ వ్యాదులన్నీ దోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కాబట్టి వాటిని లార్వా దశలోనే వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలని తెలిపారు. అందుకోసం గ్రామాల్లో పట్టణాల్లో రోడ్లపై, కాలువలలో నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాడుక నీటి నిల్వలను ఖాళీ చేయడానికి ప్రతి ఆదివారం ఉదయం పదిగంటలకు 10 నిమిషాల పాటు క్యాంపెయిన్ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ క్యాంపెయిన్ లో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొనాలని తెలిపారు. ప్రతి ఆదివారం ఉదయం 10నిమిషాల పాటు నాయకులు, ప్రజలు ప్రతి ఒక్కరు ఎవరి ఇంటి పరిసరాలలో వారు నీటి నిల్వలను అంటే కూలర్లులలో నిల్వ ఉన్న నీళ్లు, పాత్రలలో ఉండే నీళ్లు, ఇంట్లో నీటిని శుభ్రం చేసుకోవాలని సూచించారు. కాలనీలలో నీరు నిలువ ఉండే ప్రాంతాలను గుర్తించి గుంతలను పూడ్చే చర్యలు తీసుకోవాలని సూచించారు. అలా చేస్తే లార్వాలను వ్యాప్తి చెందకుండా చూడొచ్చని మంత్రి తెలిపారు.  

Tags:    

Similar News