Minister Jagadish Reddy: జల వివాదానికి ఏపీ ప్రభుత్వమే కారణం
* తాము స్నేహ హస్తం అందించినా ఏపీ అందుకోలేదు
జగదీశ్‌రెడ్డి (ఫైల్ ఫోటో)
Jagadish Reddy: తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి ఏపీ ప్రభుత్వమే కారణమని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. తాము స్నేహ హస్తం అందించినా ఏపీ అందుకోలేదని మండిపడ్డారు. ఏపీ సర్కార్ చిన్నపిల్లోడిలా వ్యవహరిస్తోందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా జీవో 203ని ఉపసంహరించుకోవాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టులన్నీ సక్రమమేనన్న మంత్రి జగదీష్‌రెడ్డి ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా కేంద్రానికి ఫిర్యాదు చేసినా తమకు ఇబ్బంది లేదన్నారు.