అలా చేయడమే సమాజ సేవ : మంత్రి హరీష్ రావు

Update: 2020-03-22 04:38 GMT

ప్రంపంచ వ్యాప్తంగా వ్యాపించే కరోనా వైరస్ పై స్వీయనియంత్రణ చేసి విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని మంత్రి హరీష్ రావు రాష్ట్రప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఈరోజు ప్రతి ఒక్కరు ఇంటిలో ఉండాలని అదే మనం సమాజానికి చేసే సేవ అని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి పిలుపు మేరకు 24గంటల పాటు జనతా కర్ఫ్యూను పాటించి విజయం సాధించాలని తెలిపారు. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఆరు గంటల వరకు ఎవరూ ఇంటి నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ఏవిధంగా ఉద్యమం చేసారో అదే విధంగా ఈ జనతా కర్ఫ్యూలో పాల్గొని కరోనాను ఎదుర్కొందామని అన్నారు. ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని, ఈ 24 గంటలకు అవసరమైన ఆహార పదర్ధాలు, మందులు, ఇతర అత్యవసర వస్తువులు ముందే తెచ్చుకని ఉండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ ఒక్కరూ రోడ్డు మీదకు రాకూడదని ఆయన అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తి కట్టడి చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుందన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ చేయడం ద్వారా వైరస్ ను అరికట్టగలమని తెలిపారు. స్వీయ నియంత్రణతో పాటు సబ్బుతోను, శానిటైజర్స్ తో చేతులు శుభ్రపర్చుకోవాలని సూచించారు.

ఎవరికైనా జలుబు, జ్వరం, దగ్గు వంటి లక్షణాలు కనబడితే ఆలస్యం చేయకుండా ఆస్పత్రులకు వెల్లి వైద్యులను సంప్రదించాలని కోరారు. విదేశాల నుంచి ఎవరు వచ్చినా వారు స్వచ్ఛంధంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలని తెలిపారు.

కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఆదివారం నాడు 'జనతా కర్ఫ్యూ' పాటించాలని ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తెలంగాణ ఆదర్శంగా నిలవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ రోజున తెలంగాణ ప్రజలు స్వీయ నియంత్రణ పాటించి కరోనాను నివారించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో 24గంటల పాటు జనతా కర్ఫ్యూ పాటిద్దామని పిలుపునిచ్చారు. జనతా కర్ఫ్యూలో భాగంగా ఆర్టీసీ బస్సులు కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బస్సులను కూడా నిలిపివేస్తున్నామని తెలిపారు. 24గంటల పాటు ఇతర రాష్ట్రాల ఇరత రాష్ట్రాల బార్డర్ లన్నీ కూడా మూసివేస్తున్నట్టు తెలిపారు. నగరంలో మెట్రో రైలు సేవలు కూడా నిలిపివేస్తున్నామని ఆయన స్పష్టం చేసారు.

విదేశాల నుంచి వచ్చిన వారి వల్లే కరోనా వైరస్ వ్యాపిస్తోందన్న ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో విదేశాల నుంచి వచ్చిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైద్యులను కలవాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా రావడానికి నిరాకరిస్తే ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. 65 సంవత్సరాలు పైబడిన వారు, పది సంవత్సరాల వయసు లోపు ఉన్నవారు రెండు వారాల పాటు బయటకు రావొద్దని సూచించారు. రాష్ట్రంలో అవసరమైతే టోటల్ షట్ డౌన్ చేస్తామని ప్రకటించారు. బోర్డర్లు కూడా మూసేస్తామన్నారు. పరిస్థితిని బట్టి నిత్యావసర సరుకులు కూడా ఇంటికి పంపిణీ చేస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.




Tags:    

Similar News