సికింద్రాబాద్ నారాయణగూడలో 55వ బ్యాంక్ నేషనలైజేషన్ డే సందర్భంగా సమావేశం
55th Bank Nationalization Day: ప్రజలకు బ్యాంకులు మంచి సేవలను అందిస్తున్నాయి
సికింద్రాబాద్ నారాయణగూడలో 55వ బ్యాంక్ నేషనలైజేషన్ డే సందర్భంగా సమావేశం
55th Bank Nationalization Day: 55వ బ్యాంక్ నేషనలైజేషన్ డే సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. బ్యాంక్‌ల జాతీయ దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలిపారు అల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షులు ఎస్ అప్పస్వామి. ప్రజలకు సేవలు అందించడంలో బ్యాంకులు ఎంతో కృషి చేస్తున్నాయని తెలిపారు. బ్యాంక్ జాతీయకరణ తరువాతే దేశం అన్నిరంగలల్లో అభివృద్ధి చెందుతోందని...
దేశాభివృద్ధికి ప్రభుత్వ రంగ బ్యాంకులు తోడ్పాటునందించాయన్నారు. స్వాతంత్రానికి ముందు తరువాత బ్యాంకింగ్ వ్యవస్థ ప్రైవేట్ సంస్థల వ్యక్తుల ఆధీనంలో ఉండేదని అల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ తెలంగాణ స్టేట్ కార్యదర్శి జి. నాగేశ్వర్ గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ప్రజల అవసరాలు తిరుస్తూ... అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.