Edupayala Temple: మళ్లీ మూసివేసిన ఏడుపాయాల అమ్మవారి ఆలయం

Edupayala Temple: ఏడుపాయల అమ్మవారికి జలగ్రహణము పట్టిందా అనే విధంగా మంజీరా నది ప్రవహిస్తుంది.

Update: 2025-09-15 07:55 GMT

Edupayala Temple: ఏడుపాయల అమ్మవారికి జలగ్రహణము పట్టిందా అనే విధంగా మంజీరా నది ప్రవహిస్తుంది. ఈ ఆలయాన్ని మంజీరా నది గత నెల రోజులుగా వరద ప్రవాహంతో ముంచేస్తుంది. మూడు రోజులు అమ్మవారు పూజలు అందుకుందో లేదో మళ్ళీ అకాల వర్షం వల్ల నది ఉదృతంగా ప్రవహించడంతో.. అమ్మవారి ఆలయాన్ని ముసివేశారు.

దీంతో రాజా గోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు ఆలయ అధికారులు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో మంజీరా నదికికి వరద పోటెత్తింది. దింతో అమ్మవారి ఆలయం ముందున్న బ్రిడ్జ్ పై నుంచి నది ప్రవహించడంతో ఆలయాధికారులు అప్రమత్తమై అమ్మవారి ఆలయాన్ని మూసేశారు.

Tags:    

Similar News