హైదరాబాద్‌లో భారీ వర్షానికి నడిరోడ్డుపై కొట్టుకుపోయిన వ్యక్తి

Update: 2019-10-01 07:44 GMT

గ్రేటర్‌ హైదరాబాద్‌లో భారీ వర్షాలు దంచికొట్టాయి. జలగండంలో చిక్కుకుని భాగ్యనగరం విలవిల్లాడిపోయింది. ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తుండడంతో జనం హైరానా పడుతున్నారు. కాలనీలు, బస్తీలు చెరువులను తలపించడమే కాక ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో జనం కష్టాలు అన్ని ఇన్నీ కావు. ఇటీవల కురిసిన వర్షానికి యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌లో నడిరోడ్డుపై ఓ వ్యక్తి కొట్టుకుపోయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరద నీటిలో కొట్టుకుపోతున్న తన ద్విచక్ర వాహనాన్ని పట్టుకునే క్రమంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నీటిలో అతడు కొట్టుకుపోయాడు. ఆ వ్యక్తి ఎవరు? ఆ తర్వాత ఏం జరిగింది? అన్న విషయాలు తెలియరాలేదు. అందరూ చూస్తుండగానే అతడు నీటిలో కొట్టుకుపోయాడు.

Full View

Tags:    

Similar News