Mallareddy Land Issue: మరోసారి తెరమీదకు మాజీ మంత్రి మల్లారెడ్డి భూ వివాదం
Mallareddy Land Issue: మరోసారి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ వివాదం తెరపైకి వచ్చింది.
Mallareddy Land Issue: మరోసారి మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి భూ వివాదం తెరపైకి వచ్చింది. కొన్నాళ్లుగా జీడిమెట్లలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డికి ఎకరం 22 గుంటలు ఉండగా.. శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి అతని మిత్రులకు 33 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూముల మధ్య వివాదం నెలకొనడంతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
బౌద్ధ నగర్ నుంచి సుచిత్రకు వెళ్లే రహదారి దగ్గర సర్వే చేస్తున్నారు. పోలీస్ బందోబస్తు నడుమ బారికేడ్లు ఏర్పాటు చేసి సర్వే నిర్వహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. మరోవైపు తమ భూముల్లో సర్వే చేస్తున్నారన్న సమాచారంతో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అనుచరులతో సహా అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులతో కాసేపు వాగ్వాదం జరిగింది.