Telangana: ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య భారీ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలుపొందారు. బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మల్క కొమురయ్యకు తెలంగాణ గవర్నమెంట్ ఆల్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్, టీయూటీఎఫ్ మద్దతు పలికాయి. కొమురయ్య గెలుపునకు తీవ్రంగా క్రిషిచేశాయి. మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి.
అటు నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి ఘన విజయం సాధించారు. యూటీఎఫ్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై ఆయన రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి చివరి వరకు పోటీ ఇచ్చారు. నర్సిరెడ్డి తర్వాతి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్, మరో స్వతంత్ర అభ్యర్థి పూలరవీందర్ ఉన్నారు. ఇక ఐదోస్థానంలో బీజేపీ అభ్యర్థి సరోత్తమ్ నిలిచారు.