Suryapet: సూర్యాపేట జిల్లా బీబీగూడెంలో పెను ప్రమాదం

Suryapet: సూర్యాపేట జిల్లా బీబీగూడెంలోని సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో పెను ప్రమాదం చోటుచేసుకుంది.

Update: 2025-12-09 07:00 GMT

Suryapet: సూర్యాపేట జిల్లా బీబీగూడెంలో పెను ప్రమాదం

Suryapet: సూర్యాపేట జిల్లా బీబీగూడెంలోని సిమెంట్ బ్రిక్స్ పరిశ్రమలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. అధిక వత్తిడి కారణంగా పరిశ్రమలోని హైడ్రాలిక్ ప్రెషర్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది.​పేలుడు ధాటికి ట్యాంక్‌ విడిభాగాలు దాదాపు 500 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డాయి. అయితే ఆ సమయంలో ప్లాంట్‌లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతుండడంతో పరిశ్రమను తమ ప్రాంతం నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. పరిశ్రమ నుంచి వచ్చే పొల్యూషన్‌తో పంట పొలాలు ధ్వంసం అవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:    

Similar News