మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును చేధించిన పోలీసులు

Hyderabad: కాసేపట్లో మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టనున్న పోలీసులు

Update: 2022-03-30 09:45 GMT

మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును చేధించిన పోలీసులు

Hyderabad: హైదరాబాద్‌లో మహేశ్ బ్యాంక్ హ్యాకింగ్ కేసును నగర పోలీసులు ఛేదించారు. దాదాపు 2 నెలలపాటు, 100 మంది పోలీసు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. ప్రధాన హ్యాకర్ దేశంలో లేడని తెలిపారు. మొత్తం 23 మంది నిందితులను ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. హ్యాకింగ్ కేసు నిందితులను బుధవారం సీవీ ఆనంద్ మీడియా ముందు ప్రవేశపెట్టారు. మహేష్ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే హ్యాకింగ్ చేయడం సులువైందని సీవీ ఆనంద్ వెల్లడించారు.

నవంబర్ నెలలో మహేష్ బ్యాంకుకు చెందిన 200 మంది ఉద్యోగులకు హ్యాకర్ ఫిషింగ్ మెయిల్స్ పంపాడని చెప్పారు. ఇద్దరు ఉద్యోగులు మెయిల్ ఓపెన్ చేయగానే హ్యాకింగ్‌కు వీలు పడిందన్నారు. మహేష్ బ్యాంక్‌ను సింగిల్ నెట్ వర్క్‌తో నడిపిస్తున్నారని చెప్పారు.. అసలు బ్యాంకింగ్ వ్యవస్థలో ఒకే నెట్ వర్క్ వాడకూడదని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థకు ఫైర్ వాల్స్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కానీ, మహేష్ బ్యాంక్ అలాంటిది ఏర్పాటు చేసుకోలేదని తెలిపారు. ఈ కేసులో మహేష్ బ్యాంకు సిబ్బంది పాత్రపైనా విచారణ చేస్తామన్నారు సీవీ ఆనంద్. 

Tags:    

Similar News