Maha Shivaratri: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు..శివనామస్మరణలతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
Maha Shivaratri మహాశివరాత్రి నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లోని శైవక్షేత్రాలు శివనామస్మరణలతో మార్మోగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు వేకువ జామునుంచే భక్తులు ఆలయాలకు తరలివస్తున్నారు. శ్రీకాళహస్తి, శ్రీశైలం, వేములవాడ, కీసర తదితర ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు.