మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. వృద్ధురాలిపై బిహార్ యువకుల అత్యాచార యత్నం

మహబూబాబాద్ జిల్లా చిన్ననాగారంలో దారుణం చోటుచేసుకుంది.

Update: 2025-12-23 06:36 GMT

మహబూబాబాద్ జిల్లా చిన్ననాగారంలో దారుణం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని రైస్ మిల్లులో పనిచేస్తున్న ఇద్దరు బీహార్ కార్మికులు... ఓ వృద్ధురాలిపై అత్యాచార, హత్యాయత్నానికి పాల్పడ్డారు. యువకులతో ప్రతిఘటించిన మహిళ పారిపోయి రహదారి దగ్గరకు చేరుకోగా... అటుగా వెళ్తున్న యువకుడు ఆమెని గమనించి పోలీసులకు, 108కు సమాచారం అందించాడు. పోలీసులు సంఘటనా స్థాలానికి చేరుకొని బాధిత మహిళను మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామస్తులు ఒక బీహార్ యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా... మరో యువకుడు పరారీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News