తెలంగాణ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాల్సిందే : మధుయాష్కీ

తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ అన్నారు. టీపీసీసీ ప్రక్షాళనపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌ ఇప్పటికే దృష్టిపెట్టారని తెలిపారు.

Update: 2020-11-06 10:34 GMT

తెలంగాణ కాంగ్రెస్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ అన్నారు. టీపీసీసీ ప్రక్షాళనపై తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ మాణిక్యం ఠాకూర్‌ ఇప్పటికే దృష్టిపెట్టారని తెలిపారు. టీకాంగ్రెస్‌ ప్రక్షాళన జరగకపోవడానికి గత ఇన్‌ఛార్జ్ కుంతియానే కారణమన్న మధుయాష్కీ.. కుంతియా తన పదవిని కాపాడుకోవడమే చూసుకున్నారని మండిపడ్డారు. ఒకవేళ విజయశాంతి పార్టీ వీడితే అది టీపీసీసీ ఫెయిల్యూరేనన్నారు.

టీఆర్ఎస్‌లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ సోనియాపై నమ్మకంతో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరితే రాష్ట్ర నాయకత్వం ఆమెను సరిగా వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డారు. విజయశాంతి ఇష్యూని సోనియా చూస్తున్నారన్న మధుయాష్కీ.. అధినేత్రి ఆదేశాలతోనే ఠాకూర్‌ ఆమెతో చర్చలు జరిపారని వెల్లడించారు. ఏదిఏమైనాసరే ఎన్నికల్లో గెలుపు ఓటములకు రాష్ట్ర నాయకత్వమే బాధ్యత తీసుకోవాలని అన్నారు.

Tags:    

Similar News