కేసీఆర్ సంచలన నిర్ణయం : తెలంగాణలో వేతనాల కోత

కరోనా ఎఫెక్ట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై గట్టిగానే పడింది..

Update: 2020-03-30 16:11 GMT

కరోనా ఎఫెక్ట్ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలపై గట్టిగానే పడింది.. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై ప్రగతిభవన్‌లో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు... ఉద్యోగుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తున్నట్లు నిర్ణయించారు. అంతేకాకుండా తనతో పాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు. ఇక ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత ఉంటుంది. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. ఇక అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత ఉంటుంది. నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత ఉండగా,మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు.


Tags:    

Similar News