వలలో చిక్కిన చిరుత..రాజపేట వాసులకు ప్రశాంతత

గత కొంత కాలంగా చిరుత పులులు అడవులను వదిని పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

Update: 2020-05-28 05:28 GMT

గత కొంత కాలంగా చిరుత పులులు అడవులను వదిని పట్టణాలు, గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా నల్లగొండ జిల్లాలోనూ ఓ చిరుత కలకలం సృష్టించింది. ఎట్టకేలకు అది వలలో చిక్కడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తివివరాల్లోకెళ్తే నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం రాజపేటలో గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. కొద్ది రోజులుగా గ్రామ సమీపంలో చిరుత సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బయటికి వెళ్లాలంటేనే బిక్కు బిక్కు మంటూ జీవనం గడుపుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు దాన్ని ఉచ్చులో పడేసేందుకు వలను పన్నారు. అధికారుల అంచనాల ప్రకారమే పులి వలలో చిక్కింది. గరువారం ఉదయం గమనించిన పలువురు రైతులు పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షణ చేపట్టారు.

ఇక ఇదే ఏడాది ఇదే మండలంలోని అజలాపురం గ్రామంలో కూడా అధికారులు పులిని వలపన్ని పట్టుకున్నారు. ఈ పులి మొత్తం ఎనిమిది దాడుల్లో పలు మేకలు, ఆవు దూడలు పులికి ఆహారం అయ్యాయి.

హెచ్ఎంటీవీ లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags:    

Similar News