ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

Update: 2019-10-28 07:59 GMT

మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని బాబునాయక్‌ తండాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆ యువతి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాయమాటలు చెప్పి తనను మోసం చేశాడని పెళ్లి చేసుకోమంటే మొహం చాటేస్తున్నాడని చెబుతోంది. దీంతో చేసేదేమి లేక ధర్నాకు దిగానని ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని బాధితురాలు వేడుకుంటోంది.

Tags:    

Similar News