అభిమాని శరీరంపై పచ్చబొట్టు.. ట్విట్టర్ లో కేటీఆర్ స్పందన..
తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రజల్లో ఎంతో అభిమానాన్ని పొందింది.
తెలంగాణ రాష్ట్రం సాధించిన తరువాత టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రజల్లో ఎంతో అభిమానాన్ని పొందింది. ఇక ఆ పార్టీనే తన భుజాలపై నడపిస్తూ తనదైన శైలిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తులన్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కూడా చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే వారిలో కొంత మంది తమ అభిమానాన్ని చాటడానికి ఎవరికి నచ్చిన శైలిలో వారు తెలుపుతున్నారు. అందులో కొంతమంది పట్టు చీరలమీద కేటీఆర్ చిత్రాన్ని అచ్చేవేస్తే, మరికొంత మంది పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఇప్పుడు ఈ నేపథ్యంలోనే రవి కిరణ్ అనే వ్యక్తి తన అబిమానాన్ని విచిత్రంగా చాటుకున్నాడు. సమయం చిక్కినప్పుడల్లా ఇటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే కేటీఆర్ కు తాను చేసిన పనిని ట్విటర్ ద్వారా తెలియజేసాడు. తను కేటీఆర్ కూ వీరాభిమానినని, ఇంతకంటే ఎక్కువ అభిమానం ఎవరూ చూపించరంటూ ఏకంగా ఆయన బొమ్మను ఆ యువకుడు తన వీపుపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు. ఆ పచ్చబొట్టులో కూడా 'యంగ్ డైనమిక్ లీడర్.. జై రామ్ అన్న' అంటూ అచ్చే వేయించుకున్నాడు. ఆ తరువాత దాన్ని నీటిగా ఫోటో తీసీ ట్విట్టర్లో పోస్ట్ చేసి కేటీఆర్‌ను ట్యాగ్ చేశాడు.
ఇక ఆ అభిమాని చేసిన పోస్ట్ పై కేటీఆర్ ఏ విధంగా స్పందించాడంటే..'ఇది నిజమా.. క్షమించు బ్రదర్ నేను ఇలాంటి వాటికి మద్దతివ్వను. అలాగే ప్రోత్సహించను. ఇది పూర్తిగా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మంచిది కాదు.' అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఈ పచ్చబొట్టు పై, ఆ యువకుడు చేసిన పనిపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు మాత్రం ఈ విధంగా కామెంట్ చేస్తున్నారు. కేటీఆర్ పై అభిమానం ఉంటే చెట్లు నాటొచ్చుకదా అని కొందరంటుంటే, మంచి పనులకు చేయొచ్చు కదా అనికొందరంటున్నారు. అంతే కాదు అంత అభిమానం ఉంటే 'జై కేటీఆర్' అంటూ మద్దతు తెలుపు అని అంటున్నారు.
Is that for real!!!! 😐 Sorry brother but I don't support or endorse these. It's absolutely unhealthy and disturbing 🙏 https://t.co/JlS7pqE7NO
— KTR (@KTRTRS) February 24, 2020