KTR: కుసుమ జగదీష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్
KTR: కుసుమ జగదీష్ హఠాన్మరణం బాధాకరమన్న కేటీఆర్
KTR: కుసుమ జగదీష్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్
KTR: తెలంగాణ ఉద్యమ నేత, ములుగు జెడ్పీచైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కుసుమ జగదీష్ హఠాన్మరణాన్ని జీర్నించుకోలేక పోతున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన అన్నారు. నాలుగైదు రోజుల క్రితమే తమతో కలిసి అధికార కార్యక్రమాల్లో జగదీష్ పొల్గొన్నారని కేటీఆర్ తెలిపారు.
జగదీష్ పార్దీవ దేహంపై బీఆర్ఎస్ జెండాను ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జగదీష కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కేటీఆర్ తో పాటు రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు.