KTR: రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్.. ఎన్నికల్లో ఆగమాగం అయ్యి ఓట్లు వేయకండి..
KTR: కాంగ్రెస్‌కు 11సార్లు ఛాన్స్ ఇస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
KTR: రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్.. ఎన్నికల్లో ఆగమాగం అయ్యి ఓట్లు వేయకండి..
KTR: కాంగ్రెస్‌కు 11సార్లు ఛాన్స్ ఇస్తే కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫ్లోరోసిస్‌తో అల్లాడుతున్న నల్లగొండకు కాంగ్రెస్ చేసిందేమి లేదన్నారు. ఎన్నికల్లో ఆగమాగం అయ్యి ఓట్లు వెయ్యొద్దు..విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి అంటున్నారు, ప్రాజెక్టు కట్టిందే 80 వేల కోట్లతో లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని కేటీఆర్ ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ లీడర్ కాదు రీడర్ అని ఎద్దేవా చేశారు. రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఒక 420 అని, రేవంత్ రెడ్డి కంటే అవినీతి పరుడు ఎవరు లేరన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు అని.. కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యే సీట్లను.. బీజేపీలో చేరుస్తాడని కేటీఆర్ విమర్శించారు.