KTR: తప్పుడు ప్రచారాలపై కేటీఆర్ ఆగ్రహం..
పక్క రాష్ట్రంలో పోలవరం 1940 నుంచి 2027 పూర్తి అవుతుందట-కేటీఆర్ ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రజలకు కాళేశ్వరం గూర్చి తెలుసు జనాభా ఎంత పెరిగిన నీళ్ళకి ఇబ్బంది లేకుండా కాళేశ్వరం నిర్మాణం
తప్పుడు ప్రచారాలపై కేటీఆర్ ఆగ్రహం..
కేసీఆర్ పనితనాన్ని ప్రపంచానికి తెలిసేలా చెప్పడంలో విఫలమయ్యామని కేటీఆర్ అన్నారు. పక్క రాష్ట్రంలో పోలవరం 1940 నుంచి 2027వ సంవత్సరానికి పూర్తి అవుతుందటా అని విమర్శించారు. ఎలాంటి తప్పుడు ప్రచారం చేసిన ప్రజలకు కాళేశ్వరం గూర్చి తెలుసునన్నారు.హైదరాబాద్ జనాభా ఎంత పెరిగిన నీళ్ళకి ఇబ్బంది లేకుండా కాళేశ్వరం నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం కూలితే హైదరాబాద్కి నీళ్లు ఎలా తెస్తారని అక్బరుద్దీన్ అడిగితే.. రేవంత్ కళ్ళు తేలవేశారని అన్నారు. బీఆర్‌ఎస్ కట్టిన ఫ్లై ఓవర్స్కి, తెచ్చిన కంపెనీలకు రేవంత్ రెడ్డి రిబ్బన్ కట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. శనేశ్వరం లాంటి కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టే వరకు కాళేశ్వరం గూర్చి ప్రజలకు తెలియజేయాలని కేటీఆర్ అన్నారు.