దశలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు : కేటీఆర్

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేబినెట్ ఆమోదన అనంతరం నాలుగేళ్లలో దశలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు జరగనున్నట్లు వెల్లడించారు.

Update: 2019-09-20 05:27 GMT

తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభవైయ్యాయి. అందులో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. నర్సంపేట నియోజకవర్గంలో, చెన్నూర్‌లో మాన్యువల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. కేబినెట్ ఆమోదన అనంతరం నాలుగేళ్లలో దశలవారీగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు జరగనున్నట్లు వెల్లడించారు. రూ. 50 కోట్లతో మిర్చికి సంబంధించిన ఆహారశుద్ధి పరిశ్రమ వస్తోందని మంత్రి పేర్కొన్నారు. అన్ని గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆహార తయారీ విధానం ముసాయిదాపై చర్చలు జరుగుతున్నాయిని కేటీఆర్ తెలిపారు.  

Tags:    

Similar News