KTR On Modi: ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయి
KTR On Modi: రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదనడం సరికాదు
KTR On Modi: ప్రధాని మోదీ వ్యాఖ్యలు దిగ్భ్రాంతి కలిగించాయి
KTR On Modi: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్‌లో ప్రధాని మోడీ వ్యాఖ్యల పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్‌ను విమర్శించే ప్రయత్నంలో మోడీ.. పదేపదే తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉన్నాయని ట్విట్టర్ వేదికగా విమర్శించారు కేటీఆర్. మోదీ...తెలంగాణ విరోధి! తెలంగాణ మీద పదే..పదే అదే అక్కసు ఎందుకు ..? అమృతకాల సమావేశాలని పేరుపెట్టి. విషం చిమ్మడం ఏం సంస్కారం ..?
తెలంగాణ అంటేనే గిట్టనట్టు..పగబట్టినట్టు మా పుట్టుకను ప్రశ్నించడం పద్ధతేనా..? తల్లిని చంపి బిడ్డను తీసారని అజ్ఞానం..అహంకారంతో ఇంకెన్నిసార్లు మా అస్తిత్వాన్ని అవమానిస్తారంటూ ప్రశ్నించారు కేటీఆర్. సున్నితమైన చారిత్రక అంశాలపై అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు కేటీఆర్. ప్రధాని అవమానకర వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదన్నారు. రాష్ట్రావతరణ దిశగా లెక్కలేనన్ని త్యాగాలు, అవిశ్రాంత పోరాటాలు జరిగాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను జరుపుకోలేదనడం సరికాదన్నారు కేటీఆర్.