KTR: నేడు నల్లగొండకు కేటీఆర్‌

KTR: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు.

Update: 2025-12-23 06:13 GMT

KTR: నేడు నల్లగొండకు కేటీఆర్‌

KTR: భారత రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా ఈ పర్యటన సాగనుంది.

ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు మరియు వార్డు మెంబర్లను గౌరవించేందుకు జిల్లా కేంద్రంలో భారీ 'సన్మాన సభ' ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ఎన్నికైన ప్రజా ప్రతినిధులను ప్రత్యేకంగా అభినందించనున్నారు.

నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి. జిల్లా సరిహద్దుల నుండి సభా ప్రాంగణం వరకు గులాబీ జెండాలతో తోరణాలు నిర్మించి పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఈ పర్యటనతో జిల్లా రాజకీయాల్లో మరోసారి ఉత్సాహం నెలకొంది.

Tags:    

Similar News