KTR: పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు
KTR: పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదు
KTR: పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదు
KTR: భువనగిరి లోక్‌సభ స్థానం సన్నాహక మీటింగ్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన మీద దృష్టి పెట్టి పార్టీని పట్టించుకోలేదన్నారు. పార్టీలో సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామన్నారు. నియోజవర్గాల్లో ఎమ్మెల్యే కేంద్రంగా పార్టీని నడపడం సరికాదని, ఈ 10ఏళ్లలో కార్యకర్తల ఆర్థిక పరిస్థితిని పార్టీ పట్టించుకోలేదన్నారు కేటీఆర్. ప్రభుత్వానికి, పథకాలకు నడుమ కార్యకర్త లేకుండా..
నేరుగా లబ్దిదారునికే చేరడం వల్ల ఓటరుకు కార్యకర్తకు లింకు తెగిందన్నారు కేటీఆర్. దళిత బంధు కొందరికే రావడంతో మిగతావారు వ్యతిరేకమయ్యారని కేటీఆర్ పేర్కొన్నారు. రైతుబంధుకు పరిమితి లేకపోవడం కూడా మైనస్ అయిందన్నారు. బీఆర్ఎస్‌ను ప్రజలు నిర్దద్వందంగా తిరస్కరించలేదని, చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడామన్నారు కేటీఆర్. 14 చోట్ల వందలు, వేలల్లో మాత్రమే మెజారిటీ తగ్గిందన్నారు కేటీఆర్. ఖశ్చితంగా గెలుస్తామనుకున్న జిల్లాల్లో విభిన్న ఫలితాలు రావడం నిరాశపరిచిందన్నారు.
లోక్‌సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధం అవుతోంది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు నేతృత్వంలో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని విశ్లేషించుకుంటూ.. లోక్‌సభ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై.. గులాబీ లీడర్లు, కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు అగ్రనేతలు. ఇవాళ భువనగిరి లోక్‌సభ పరిధిలోని నేతలతో కేటీఆర్ సమావేశం అయ్యారు. ఓటమిని సమీక్షించుకుని రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రెంట్టించిన ఉత్సాహంతో పాల్గొందామని కేటీఆర్ సూచించారు. భువనగిరి సీటుతో సహా మెజారిటీ స్థానాలను సాధిద్దామన్నారు కేటీఆర్.
కొంతమంది చేయిగుర్తుకు వేసిన పెద్దమనుషులు కేసీఆర్ CM ఎందుకు కాలేదని అడుగుతున్న విషయం ఆలోచింపచేసింది.