Rtc Strike: కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు

-కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కోదండరాం -కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం -ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్‌కు భంగపాటు తప్పదు -ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదు-కోదండరాం ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర-కోదండరాం -ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రేపట్నుంచి ఉద్యమం -సకల జనుల సమ్మె తరహాలో ఉద్యమిస్తాం-కోదండరాం -ఉద్యమ ద్రోహులు... ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు -కేసీఆర్ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం-కోదండరాం

Update: 2019-10-09 13:03 GMT

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నిప్పులు చెరిగారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్న కోదండరాం ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్‌కు భంగపాటు తప్పదని హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇక, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా రేపట్నుంచి ఉద్యమం చేపడతామన్న కోదండరాం... ప్రభుత్వం దిగిరాకపోతే, సకల జనుల సమ్మె తరహాలో ఉద్యమిస్తామన్నారు.

Tags:    

Similar News