Kishan Reddy: అనంతగిరిని వందకోట్లతో అభివృద్ధి చేస్తాం
Kishan Reddy: అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకే పీఎం జన్‌మన్ పథకం
Kishan Reddy: అనంతగిరిని వందకోట్లతో అభివృద్ధి చేస్తాం
Kishan Reddy: అందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని మోడీ పీఎం జన్‌మన్ పథకం ప్రవేశపెట్టారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీఎం జన్‌మన్ పథకం కోసం కేంద్రం 25వేల కోట్లు కేటాయిస్తుందన్నారు. దేశంలో 75 సంవత్సరాలుగా గిరిజన ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికీ విద్యుత్, రోడ్ల సౌకర్యం లేదని చెప్పారు.వికారాబాద్ జిల్లా ప్రాంతంలోని అనంతగిరిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని... సుమారు 100 కోట్లతో అభివృద్ధి పరుస్తామని తెలిపారు. అనంతగిరి పర్యాటక కేంద్రానికి సంబంధించి డిపిఆర్ సిద్ధమవుతుందని చెప్పారు. వికారాబాద్ జిల్లా చైతన్యనగర్ గ్రామంలో పీఎం జన్‌మన్ పథకం ప్రారంభం సందర్భంగా ప్రధాని ప్రసంగాన్ని కిషన్‌రెడ్డి వీక్షించారు.