Kishan Reddy: ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో వందల కోట్లు బయటపడ్డాయి
Kishan Reddy: లెక్క పెట్ట లేక కౌంటింగ్ మిషన్లు మోరాయిస్తున్నాయి
Kishan Reddy: ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో వందల కోట్లు బయటపడ్డాయి
Kishan Reddy: ఒడిశాలో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో వందల కోట్లు బయటపడ్డాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. ధీరజ్ సాహు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడని చెప్పారు. ఇప్పటి వరకు 40బ్యాగులు లెక్కపెట్టారని... ఇంకా 90 బ్యాగులు లెక్కపెట్టాల్సి ఉందన్నారు. లెక్క పెట్ట లేక కౌంటింగ్ మిషన్లు మోరాయిస్తున్నాయని తెలిపారు. ఐటీ దాడుల్లో ఇంత పెద్ద మొత్తంలో అక్రమ సంపాదన పట్టుబడటం ఇదే మొదటిసారన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అరాచక పాలన రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్ నేత అక్రమ సంపాదనపై రాహుల్ గాంధీ స్పందించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు.