KCR Review: నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష

*పోడు భూముల సమస్య పరిష్కారంపై చర్చ

Update: 2021-10-23 06:55 GMT

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమీక్ష(ఫోటో- ది హన్స్ ఇండియా)

KCR Review: పోడుభూముల సమస్య పరిష్కారంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇవాళ ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సీఎం కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవెన్యూ, అటవీ, గిరిజన సంక్షేమశాఖల అధికారులు పాల్గొననున్నారు. పోడు సమస్యపై సమగ్రంగా చర్చించి, కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. ఈ సందర్భంగా పోడుభూముల సమస్యలపై వివిధ జిల్లాల్లో అధ్యయనం చేసిన ఉన్నతాధికారుల బృందం సీఎంకు నివేదికను అందజేయనున్నారు.

Full View
Tags:    

Similar News