KCR: నేను కొడితే మామూలుగా ఉండదు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన కేసీఆర్‌

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారని చెప్పినా ప్రజలు మాట వినలేదని.. తులం బంగారం అనగానే నమ్మి ఓట్లేశారని అన్నారు కేసీఆర్.

Update: 2025-01-31 10:04 GMT

KCR: నేను కొడితే మామూలుగా ఉండదు..!

KCR: జహీరాబాద్‌ బీఆర్ఎస్‌ నేతల సమావేశంలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గంభీరంగా, మౌనంగా ప్రభుత్వ పాలనను గమనిస్తున్నట్టు తెలిపారు. కొడితే మామూలుగా కాదు.. గట్టిగా కొట్టడం తనకు ఉన్న అలవాటంటూ కేసీఆర్‌ హాట్ కామెంట్స్ చేశారు.

కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచుతారని చెప్పినా ప్రజలు మాట వినలేదని.. తులం బంగారం అనగానే నమ్మి ఓట్లేశారని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో ప్రాజెక్టులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని విమర్శించారు. సంగమేశ్వరం, బసవేశ్వరం, కాళేశ్వరం ప్రాజెక్టులను ఎండబెడుతున్నారని మండిపడ్డారు.

Full View


Tags:    

Similar News