BRS Leaders Kaleshwaram Tour: నేడు కాళేశ్వరంకు బీఆర్ఎస్ నేతలు

BRS Leaders Kaleshwaram Tour: నేడు కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం అనంతరం బయలుదేరి కాళేశ్వరంకు వెళ్లనున్నారు. ఈ పర్యటన రెండు రోజులపాటు సాగుతుంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 25 July 2024 11:28 AM IST
BRS leaders to visit Kaleshwaram today
X

Brs Leaders Kaleshwaram : నేడు కాళేశ్వరంకు బీఆర్ఎస్ నేతలు

BRS Leaders Kaleshwaram Tour: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బ్రుందం నేడు మేడిగడ్డ పర్యటను వెళ్తోంది. గోదావరిలో ఉన్న నీటి ఎత్తిపోసి రైతులకు నీరు ఇచ్చే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఇవ్వడం లేని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. జలాశయాలకు నీటిని మళ్లీంచేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఈ పర్యటన చేపడుతున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంది. నేడు బడ్జెట్ ముగిసిన అనంతరం ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాళేశ్వరం ప్రాజెక్టుకు బయలుదేరనున్నారు.

సాయంత్రం కరీంనగర్ లోని దిగువ మానేరు డ్యాంను బీఆర్ఎస్ బృందం పరిశీలించనుంది. రాత్రికి రామగుండంలో బస చేయనున్నారు. మళ్లీ శుక్రవారం ఉదయం 10గంటలకు కన్నేపల్లి దగ్గర ఉన్న లక్ష్మీ పంప్ హౌస్ కు బీఆర్ఎస్ సభ్యులు వెళ్లి పరిశీలిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా మేడిగడ్డకు వెళ్లి ఆనకట్టును సందర్శిస్తారు. మేడిగడ్డ ఆనకట్ట పరిస్థితి, అక్కడ ప్రవాహం, పంప్ హౌస్ దగ్గర నీటిమట్టం, ఎత్తిపోసేందుకు ఉన్న అవకాశాలు వంటి పలు అంశాలను పరిశీలిస్తారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story