KCR: భైంసా సభలో బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ దూకుడు
KCR: మత విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరిక
KCR: భైంసా సభలో బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ దూకుడు
KCR: భైంసా సభల్లో బీజేపీ టార్గెట్‌గా సీఎం కేసీఆర్ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. బీజేపీ మత విద్వేశాలు రెచ్చగొడుతుందని ధ్వజమెత్తారు. మైనార్టీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసిన సీఎం కేసీఆర్... తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు... తెలంగాణలో సెక్యులరిజం ఉంటుందని చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత కర్ఫ్యూ అనే మాటే లేదని గుర్తుచేశారు. గొడవలు,మత విధ్వేశాల వల్ల ఒరిగేదేమీ లేదని.. అందరం కలిసి ఉండాలని ఆకాంక్షించారు. మతవిద్వేశాలు రెచ్చగొడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.