ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతాం : కేసీఆర్

తెలంగాణ పల్లె సీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌. ఇందుకోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు.

Update: 2019-09-04 01:33 GMT

తెలంగాణ పల్లె సీమలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌. ఇందుకోసం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విస్తృత ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం చేయాలన్నారు. నెలరోజుల తర్వాత ఖచ్చితంగా గ్రామాల ముఖచిత్రం మారి తీరాలని, దసరా పండుగను ప్రజలు పరిశుభ్ర వాతావరణంలో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై తెలంగాణ స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో జరిగిన రాష్ట్ర సదస్సులో సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరియాలని, సరైన పద్ధతిలో విస్తృత ప్రజా భాగస్వామ్యంతో ప్రణాళికాబద్ధంగా గ్రామాల అభివృద్ధి జరగాలని సీఎం నిర్దేశించారు. పల్లెల ప్రగతికి మంచి మార్గం వేయడానికి అమలు చేసే 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేసే బాధ్యత ప్రజల మీదే ఉందన్నారు. ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములై, ఏ ఊరి ప్రజలే ఆ ఊరి కథానాయకులై తమ గ్రామాలను తీర్చిదిద్దుకోవాలని, అవసరమైన చోట ప్రజలే శ్రమదానం చేయాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితిని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 60 లేదా 61 సంవత్సరాలకు పెంచుతామని సీఎం స్పష్టం చేశారు. అన్ని శాఖల్లో ఉద్యోగుల ప్రమోషన్ చార్టు రూపొందించాలని, తమకు ఏ తేదీన ప్రమోషన్ వస్తుందో ఉద్యోగికి ముందే తెలిసి ఉండాలని, పదోన్నతుల కోసం పైరవీలు చేసే దుస్థితి పోవాలన్నారు కేసీఆర్‌. మండల, జిల్లా పరిషత్ సమావేశాల్లో అధికారులు, ఉద్యోగులను పరుష పదజాలంలో ధూషించడాన్ని ఇకపై ప్రభుత్వం సహించదని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు సీఎం. వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ లో కలుపుతూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. 

Tags:    

Similar News