Kavitha: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

Kavitha: తెలంగాణవాదుల దిష్టికల్లతో కోనసీమ పాడయిందన్న పవన్‌ కళ్యాణ్‌ వా‌ఖ్యలపై కల్వకుంట్ల కవిత స్పందించారు.

Update: 2025-12-03 12:08 GMT

Kavitha: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన జాగృతి అధ్యక్షురాలు కవిత

Kavitha: తెలంగాణవాదుల దిష్టికల్లతో కోనసీమ పాడయిందన్న పవన్‌ కళ్యాణ్‌ వా‌ఖ్యలపై కల్వకుంట్ల కవిత స్పందించారు. కోనసీమ మాదిరిగా తెలంగాణ కావాలనుకున్నాం కానీ.. ఏనాడు ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడలేదని ఆమె తెలిపారు. గతంలో ఆంధ్రాకు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశానని కవిత గుర్తుచేశారు.

ఆంధ్ర బాగుంటే తాము కూడా బాగుంటామే తప్ప ఆంధ్రాపై ఎప్పుడు కన్నెర్ర చేయలేదన్నారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాబట్టి ఏమన్నా నడిచిందని.. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం కరెక్ట్ కాదని కవిత హితవు పలికారు.

Tags:    

Similar News