సాధారణ భక్తుడిగా మాజీ డిప్యూటీ సీఎం..

ఆసియాలోనే అతి పెద్ద జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో అమ్మవార్లు ఇంకా ఒక్క రోజే గద్దెలపై ఉంటారు. దీంతో ఆ అటవీ ప్రాంతమంతా జనావాసమైపోయింది.

Update: 2020-02-07 11:33 GMT

ఆసియాలోనే అతి పెద్ద జాతరగా పేరుపొందిన మేడారం సమ్మక్క సారక్క జాతరలో అమ్మవార్లు ఇంకా ఒక్క రోజే గద్దెలపై ఉంటారు. దీంతో ఆ అటవీ ప్రాంతమంతా జనావాసమైపోయింది. దీంతో శుక్రవారం సామాన్య ప్రజలతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూడా మేడారానికి చేరుకొని వనదేవతలను దర్శించుకుంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఉదయం తెలంగాణ గవర్నర్ తమిళి సై, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ సీఎం కేసీఆర్ మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారితో పాటుగానే తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్మేలు, అధికారులు కూడా అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూడా మేడారం చేరుకున్నారు. దేవుని ముందు అందరూ సమానమే అనే తరహాలో ఓ సాధారణ భక్తుడిలా మేడారం జాతరకు చేరుకున్నారు. సామాన్య భక్తుడిలాగే తను కూడా క్యూలో నిలబడి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అందరిలాగే మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవార్ల ఆశీర్వాదాలను తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనదేవతల ఆశీర్వాదంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిందని ఆయన అన్నారు. వనదేవతల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా ఉందని ఆయన అన్నారు.ఈ జాతరను జాతీయపండగగా గుర్తించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకూ మూడు సార్లు జాతర జరిగిందన్నారు. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ది చెందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం రూ.315 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ జాతరలో భక్తులకు ఎలాంటి అన్ని సదుపాయాలను కల్పించారని తెలిపారు.   

Tags:    

Similar News