Kadiyam Srihari: ఉపఎన్నికలు నిర్ణయించేది కేటీఆర్ కాదు.. ఎలక్షన్ కమిషన్
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.
Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక అర్హత మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌లకు లేదని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. హనుమకొండలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని లంగించే దిశగా ముఖ్య పాత్ర పోషించినవారే భారత రాష్ట్ర సమితి నేతలని విమర్శించారు.
వారిపాలనలో పలు పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో విలీనం చేయడం జరిగిందని, అప్పట్లో వారి నైతికత ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయానికి తాము గౌరవం ఇస్తామని పేర్కొన్నారు. ఉపఎన్నికలు నిర్వహించే అధికారం కేటీఆర్‌కి లేదని, అది కేవలం ఎన్నికల కమిషన్ పరిధిలో మాత్రమే ఉన్నదని స్పష్టం చేశారు.