కొల్లాపూర్ లో జూపల్లి వర్గం ఘనవిజయం

Update: 2020-01-25 09:39 GMT
కొల్లాపూర్ లో జూపల్లి వర్గం ఘనవిజయం

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ ఎన్నికలో జూపల్లి వర్గం ఘనవిజయం సాధించింది. మొత్తం 20 వార్డుల్లో 11 వార్డులను జూపల్లి వర్గం కైవసం చేసుకుంది. మిగిలిన 9 చోట్ల టీఆర్ఎస్ విజయం సాధించింది. మున్సిపల్ ఎన్నికల్లో తనవారికి కాకుండా వేరే వాళ్లకు పార్టీ టికెట్లు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన జూపల్లి కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 20 స్థానాల్లో తన మద్దతుదారులను బరిలోకి దింపారు. దీంతో కొల్లాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఆయన మద్దతుదారుల సొంతమైంది. 

Tags:    

Similar News