Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు నేడు ప్రారంభం

ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ ప్రక్రియ జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు ఏర్పాట్లు చేసిన ఈసీ నామినేషన్ల దాఖలుకు 10 రోజులు సమయం ఈనెల 22న నామినేషన్లు పరిశీలన

Update: 2025-10-13 06:58 GMT

Jubilee Hills Bypoll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లు నేడు ప్రారంభం

ఇవాళ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ మార్గదర్శకాలు జారీ చేశారు అధికారులు. ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సెలవు దినాలు మినహా ప్రతిరోజు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్‌కు సంబంధించి ఫారం 2B, అఫిడవిట్ కోసం ఫారం 26ను సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 22న నామినేషన్లు పరిశీలన.. ఈనెల 24 వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. నవంబర్ 11న ఎన్నిక జరగనుండగా.. 14న ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.


షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయాలి. గుర్తింపు పొందిన పార్టీ అభ్యర్థులు ఒక్క నియోజకవర్గ ఓటరును, స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ అభ్యర్థులు 10 మంది అందరూ నియోజకవర్గ ఓటర్లు అయి ఉండాలి. ఎన్‌కోర్ పోర్టల్ ద్వారా డిజిటల్ నామినేషన్ అంటే ఫారం ఆన్లైన్లో నింపవచ్చు. QR కోడ్‌తో కూడిన ప్రింటెడ్ హార్డ్ కాపీ తప్పనిసరిగా సమర్పించాలి. ఆన్లైన్ డిపాజిట్ బ్యాంక్ ట్రెజరీలో క్రెడిట్ అయి ఉండాలి.. లేకపోతే మాన్యువల్ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.


నామినేషన్ సమయంలో RO కార్యాలయానికి 100 మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలను అనుమతిస్తారు. అభ్యర్థితో సహా గరిష్టంగా ఐదుగురు ఆర్వో ఆఫీస్‌కి వెళ్లొచ్చు. అభ్యర్థుల నిబంధనలను పాటించి, ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు సహకరించాలని రిటర్నింగ్ అధికారి కోరారు..

Tags:    

Similar News