Janasena Meeting: ఈ రోజు హైదరాబాద్‌లో జనసేనపార్టీ కీలక సమావేశం
*తెలంగాణలో పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్న పవన్ కళ్యాణ్ *పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతంపై పవన్ ఉపన్యాసం
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
Janasena Meeting: ఇవాళ హైదరాబాద్‌లో జనసేనపార్టీ కీలక సమావేశం కానుంది. తెలంగాణలో పార్టీ కార్యకర్తలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. గత రెండేళ్లుగా తెలంగాణలో పార్టీ పై దృష్టి పెట్టని పవన్ కళ్యాణ్ ఇప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతం పై దృష్టి పెట్టారు అందుకోసం పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించి అందుకు తగిన సూచనలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చిలుకూరు దగ్గర జరిగే సమావేశానికి హాజరు కావాలని పార్టీ శ్రేణులకు ఇప్పటికే ఆహ్వానించారు ఇవాళ్టీ సమావేశంలో పవన్ ఏం ప్రకటన చేస్తాడోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.