Sajjala: ఏప్రిల్ 7 నుంచి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం...
Jagananne Maa Bhavishyatthu: ఏపీలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
Sajjala: ఏప్రిల్ 7 నుంచి జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమం...
Jagananne Maa Bhavishyatthu: ఏపీలో అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా సీఎం జగన్ పాలన కొనసాగుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను సజ్జల ఆవిష్కరించారు. ఏప్రిల్ 7 నుంచి 20 వరకూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలన్నదే తమ ఆశయమన్న ఆయన... రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును లబ్ధిదారులకు తెలియజేస్తామన్నారు. ప్రజలకు జవాబుదారీగా రాజకీయ పార్టీలు ఉండాలి. ప్రజలకు అనుగుణంగా పాలన ఉండాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా వివరిస్తాం. సంక్షేమ పథకాలు అమలవుతున్న తీరును తెలియజేస్తాం అని సజ్జల అన్నారు.